తెలంగాణలో జనసేన కమిటీల ఏర్పాటు
ప్రకటించిన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్
మంగళగిరి – జనసేన పార్టీ చీఫ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సంచలన ప్రకటన చేశారు. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఆయన శుక్రవారం సంచలన నిర్ణయం తీసుకున్నారు .ఈ మేరకు ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. ఇదే సమయంలో తెలంగాణలో సైతం జనసేన బలంగా ఉంది. ఇక్కడ కూడా ఆయా పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి పార్టీ పరంగా సమన్వయ కమిటీలను ఏర్పాటు చేశారు.
ఇవాళ జనసేన పార్టీ ముఖ్య నేతలతో సమావేశం అయ్యారు పవన్ కళ్యాణ్. ఈ సందర్బంగా త్వరలో జరగబోయే ఎన్నికల్లో జనసేన సత్తా చాటుతోందని, కీలకంగా మారబోతోందని చెప్పారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు .
ఇక తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మొత్తం 17 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. ఏపీలో 25 ఉండగా 175 శాసన సభ స్థానాలు ఉన్నాయి. పొత్తులో భాగంగా ప్రస్తుతం టీడీపీ, బీజేపీతో కలిసి జనసేన రంగంలోకి దిగింది.
ఇదిలా ఉండగా తెలంగాణలో పార్లమెంట్ నియోజకవర్గాల సమన్వయకర్తగా బొంగునూరి మహేందర్ రెడ్డితో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇంఛార్జ్ గా సాగర్ ను నియమించినట్లు స్పష్టం చేశారు జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్.