లోపాలు దిద్దుకుంటాం – కేటీఆర్
ప్రజలను నిందించబోం
హైదరాబాద్ – బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ , మాజీ మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో తాజాగా జరిగిన శాసన సభ ఎన్నికల్లో తమ పార్టీకి వచ్చిన ఫలితాల గురించి ఆలోఇంచడం లేదన్నారు. అయితే ఎక్కడ పొరపాట్లు జరిగాయనే దానిపై ఫోకస్ పెడతామని చెప్పారు కేటీఆర్.
బీఆర్ఎస్ పార్టీ ముందు నుంచీ ప్రజల కోసం పని చేసిందని, నిర్మాణాత్మకమైన వైఖరితో ప్రతిపక్ష పార్టీగా ప్రజా సమస్యలను ప్రస్తావిస్తూ ముందుకు సాగుతామని స్పష్టం చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. దేశంలో ఎక్కడా లేని రీతిలో ఏ పార్టీకి లేనంతటి క్యాడర్ తమ పార్టీకి ఉందన్నారు.
రాజకీయాలలో గెలుపు ఓటములు సహజమని చెప్పారు. ఇందులో బాధ పడాల్సిన అవసరం ఏముందంటూ ప్రశ్నించారు. ప్రతి దానిని సీరియస్ గా తీసుకుంటూ పోతే ఉన్న విలువైన సమయంలో ప్రజలకు అందుబాటు లోకి వెళ్ల లేమన్నారు కేటీఆర్.
ఇక నుంచి బీఆర్ఎస్ పార్టీ బలోపేతంపై ఎక్కువగా దృష్టి సారిస్తామని, ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయనే దానిపై క్లారిటీ ఉందన్నారు. దీనిని పూరించేందుకు ప్రయత్నం చేస్తామన్నారు .