NEWSANDHRA PRADESH

బాబు నిర్వాకం వాలంటీర్ల ఆగ్ర‌హం

Share it with your family & friends

వైసీపీ ఎంపీ విజ‌య సాయి రెడ్డి
నెల్లూరు జిల్లా – తెలుగుదేశం పార్టీ చీఫ్, మాజీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడుపై తీవ్ర స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు వైసీపీ ఎంపీ విజ‌య సాయి రెడ్డి. పార్ల‌మెంట్, శాస‌న స‌భ ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు కూట‌మికి షాక్ త‌ప్ప‌ద‌న్నారు. ప్ర‌జ‌లు వారిని విశ్వ‌సించ‌డం లేద‌ని పేర్కొన్నారు.

చంద్ర‌బాబు నాయుడు ప‌నిగ‌ట్టుకుని వాలంటీర్ల పాలిట శాపంగా మారార‌ని ఆరోపించారు. అడుగ‌డుగునా అడ్డంకులు త‌గిలిన ప‌రిస్థితిని ప్ర‌జ‌లు అర్థం చేసుకున్నార‌ని చెప్పారు విజ‌య సాయి రెడ్డి. వారి సేవ‌ల‌ను అడ్డు కోవాల‌ని అనుకోవ‌డం దారుణ‌మ‌న్నారు.

ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌ని పేర్కొన్నారు. రాష్ట్ర ప్ర‌జ‌లు చంద్ర‌బాబు నాయుడును న‌మ్మే స్థితిలో లేర‌న్నారు. అన్ని వ్య‌వ‌స్థ‌ల‌ను మ్యానేజ్ చేస్తూ వ‌చ్చారే త‌ప్పా ప్ర‌జ‌ల కోసం కాద‌న్నారు. తాను అధికారాన్ని అడ్డం పెట్టుకుని చేసిన నిర్వాకం గురించి ఎంత చెప్పినా త‌క్కువేన‌ని పేర్కొన్నారు విజ‌య సాయి రెడ్డి.

టీడీపీ కూట‌మి ప‌గ‌టి క‌ల‌లు కంటోంద‌న్నారు. ఇప్ప‌టికే ఏపీని స‌ర్వ నాశ‌నం చేసిన ఘ‌న‌త చంద్ర‌బాబు నాయుడుకు ద‌క్కుతుంద‌న్నారు. ఆయ‌న చేసిన మోసం గురించి ఎంత చెప్పినా త‌క్కువేన‌ని అన్నారు వైసీపీ సిట్టింగ్ ఎంపీ.