డీఎంకే సర్కార్ బక్వాస్
బీజేపీ చీఫ్ కె. అన్నామలై
తమిళనాడు – భారతీయ జనతా పార్టీ చీఫ్ కె. అన్నామలై కుప్పు స్వామి నిప్పులు చెరిగారు. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా ఆయన కోయంబత్తూరు లోక్ సభ స్థానం నుంచి బరిలో ఉన్నారు. ఎలాగైనా సరే గెలవాలని కంకణం కట్టుకున్నారు..
ఇప్పటికే ఆయన తరపున ప్రచారం చేపట్టారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. తాజాగా తమిళనాడు లోని మధురై నియోజకవర్గంలో కేంద్ర హొం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా పర్యటించారు. ఈ సందర్బంగా నిర్వహించిన బీజేపీ రోడ్ షోకు ఊహించని రీతిలో జనం తరలి వచ్చారు.
ఇదిలా ఉండగా కె. అన్నామలై తీవ్ర వ్యాఖ్యలు చేశారు డీఎంకే పార్టీపై, ఆ పార్టీ చీఫ్ సీఎం ఎంకే స్టాలిన్ పై. ఆయన పదునైన బాణాలు వాడారు. దేశ వ్యాప్తంగా మోదీ హవా నడుస్తోందని, ఇక తమిళనాట బీజేపీ క్లీన్ స్వీప్ చేయడం ఖాయమని జోష్యం చెప్పారు కె. అన్నామలై.
మోదీ హవా దెబ్బకు ఇండియా కూటమి పటా పంచలు కావడం తప్పదన్నారు. ఇవాళ యావత్ ప్రపంచం మొత్తం భారత దేశం వైపు చూసేలా ఘనత ఒక్క నరేంద్ర మోదీకి మాత్రమే దక్కుతుందన్నారు కె. అన్నామలై కుప్పు స్వామి. ఇదే సమయంలో తమకు మద్దతు ఇచ్చిన తెలుగు వారందరికీ పేరు పేరునా ధన్యవాదాలు తెలియ చేసుకుంటున్నానని చెప్పారు.