ఏపీ కేజీబీవీ విద్యార్థినికి కంగ్రాట్స్
అభినందించిన ఎంపీ విజయ సాయి రెడ్డి
అమరావతి – వైసీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి అత్యధిక మార్కులు సాధించిన ఏపీకి చెందిన విద్యార్థిని జి. నిర్మలను ప్రత్యేకంగా అభినందించారు. కర్నూల్ లోని కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయం (కేజీబీవీ)లో చదువుకుంటోంది. ఈ కేజీబీవీలన్నీ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో నడుస్తాయి. ప్రత్యేకించి ఆనాటి ప్రధాని దివంగత అటల్ బిహారీ వాజపేయ్ హయాంలో దీనికి శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం విజయవంతంగా కొనసాగుతున్నాయి.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో ఎలాంటి చదువుకు నోచుకోని వారంతా ఇందులో 10 వరకు చదువుకుంటారు. ఈ మధ్యనే వాటిని ఇంటర్ దాకా అప్ గ్రేడ్ చేస్తూ వచ్చింది కేంద్ర సర్కార్. ఇదిలా ఉండగా ఏపీ సర్కార్ ఇంటర్ తొలి సంవత్సరం ఫలితాలను ప్రకటించింది.
ఇందులో కర్నూల్ కేజీబీవీకి చెందిన జి. నిర్మల ఏకంగా 440 మార్కులకు గాను 421 మార్కులు సాధించింది. టాప్ లో నిలిచినందుకు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు ఎంపీ విజయ సాయి రెడ్డి. ఆయనతో పాటు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సైతం ప్రశంసలు కురిపించారు. తమ ప్రభుత్వం ప్రధానంగా విద్య, వైద్యం, ఉపాధి రంగాలపై ఫోకస్ పెట్టడం జరిగిందన్నారు. భవిష్యత్తులో ఐపీఎస్ కావాలన్న ఆమె కోరిక, కల సాకారం కావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు ఎంపీ.