జగన్ ఇక ఇంటికే – చంద్రబాబు
జనం డిసైడ్ అయ్యారంటూ కామెంట్
అమరావతి – ఏపీలో రాచరిక పాలనకు ముగింపు పలికే సమయం ఆసన్న మైందని అన్నారు టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు. పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బాపట్ల జిల్లా కొల్లూరు, రేపల్లె లో జరిగిన ప్రజా గళం సభలలో ప్రసంగించారు. ఈ సందర్బంగా ఆయన ఏపీ సీఎం జగన్ రెడ్డిని టార్గెట్ చేశారు. ఆయన వల్లనే ఏపీ అప్పుల కుప్పగా మారిందని ఆరోపించారు.
అధికారాన్ని అడ్డం పెట్టుకుని జనాన్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేశాడని ధ్వజమెత్తారు. అందుకే ఆయనను ఇంటికి పంపించాలని సిద్దమయ్యారని చెప్పారు. తాము వచ్చాక ప్రజా రంజక పాలన సాగిస్తామని చెప్పారు నారా చంద్రబాబు నాయుడు.
వై నాట్ 175 అంటూ జగన్ రెడ్డి పగటి కలలు కంటున్నాడని, ఆయనకు అంత సీన్ లేదన్నారు. ఇక పెట్టే బేడా సర్దుకుని ఇంటికి వెళ్లాల్సిన సమయం వచ్చిందన్నారు. ప్రజలు స్పష్టమైన తీర్పు ఇవ్వబోతున్నారని అది భారీ షాక్ ఇచ్చేలా ఉంటుందని జోష్యం చెప్పారు నారా చంద్రబాబు నాయుడు.
అందినంత మేర దోచుకోవడం, దోచుకున్న దానిని దాచు కోవడంపైనే ఎక్కువగా సీఎం ఫోకస్ పెట్టాడని సంచలన ఆరోపణలు చేశారు.