తమిళ నాట బీజేపీ క్లీన్ స్వీప్
బీజేపీ చీఫ్ కె. అన్నామలై కుప్పుస్వామి
తమిళనాడు – పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటడం ఖాయమన్నారు బీజపీ చీఫ్ కె. అన్నామలై కుప్పుస్వామి. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం తమిళనాడు లోని థేని లోక్ సభ నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్బంగా నిర్వహించిన రోడ్ షోకు భారీ ఎత్తున ఆదరణ లభించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు కె. అన్నామలై కుప్పు స్వామి.
ఇక్కడ బరిలో ఉన్న అన్నన్ ను ఎన్నుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఎందుకంటే అభివృద్ది కావాలంటే బీజేపీకి ఓటు వేయాలన్నారు. లేక అవినీతిని అందలం ఎక్కిస్తామంటే డీఎంకేకు ఓటు వేయండని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇన్నేళ్ల పాటు తమిళనాడును పాలిస్తున్న డీఎంకే రాష్ట్రం కోసం, ప్రజల అభ్యున్నతి కోసం ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు కె. అన్నామలై కుప్పు స్వామి.
గత 35 నెలలుగా స్టాలిన్ ప్రజలను మోసం చేస్తూ వస్తున్నారని ఆరోపించారు. ఆయన ఏ ఒక్క పని పూర్తి చేయలేదని ధ్వజమెత్తారు. డీఎంకేను ఈసారి ఎన్నికల్లో లేకుండా చేయాలని పిలుపునిచ్చారు. ఆ పార్టీ కనుమరుగు అయితేనే డెవలప్ మెంట్ అన్నది ముందుకు సాగుతుందన్నారు. ఇక ముచ్చటగా మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ఎన్నిక కావడం ఖాయమన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు.