బీఆర్ఎస్ పై భగ్గుమన్న కేకే
కేటీఆర్ కామెంట్స్ పై ఆగ్రహం
హైదరాబాద్ – బీఆర్ఎస్ పార్టీపై సీనియర్ నాయకుడు కే కేశవరావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడారు. తనను కేసీఆర్ పట్టించు కోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాను పార్టీని బలోపేతం చేయడంలో కీలకమైన పాత్ర పోషించానని చెప్పారు. ఇదే సమయంలో తనకు గుర్తింపు ఇవ్వలేదని వాపోయారు. ఇదే కాంగ్రెస్ పార్టీలో తాను సీనియర్ నాయకుడినన్న గౌరవం ఉండేదన్నారు. అది ఆ పార్టీలో లేకుండా పోయిందన్నారు.
బీఆర్ఎస్ పార్టీ నిర్వాకం వల్ల కలిసి ఉన్న కుటుంబంలో కలహాలు వచ్చాయని సంచలన ఆరోపణలు చేశారు. మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు తనకు కన్నీళ్లు తెప్పించాయని ఆవేదన వ్యక్తం చేశారు కే కేశవరావు.
తన కొడుకు కోసం ఎమ్మెల్సీ పదవి ఇవ్వమని కోరానని, కానీ కేసీఆర్ పట్టించు కోలేదని మండిపడ్డారు. తన అనుభవం చూసైనా రెస్పెక్ట్ ఇవ్వాల్సి ఉండేదని కానీ బీఆర్ఎస్ లో అలాంటిది ఏదీ తనకు దక్కలేదని మండిపడ్డారు కేశవ రావు. బీఆర్ఎస్ పార్టీ వల్ల తనకు ఒరిగింది ఏమీ లేదని చెప్పారు. ప్రస్తుతం కేకే చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి.