జగన్ పై దాడి..ఈసీ సీరియస్
నివేదిక ఇవ్వాలని ఆదేశం
న్యూఢిల్లీ – కేంద్ర ఎన్నికల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. విజయవాడలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై దాడి జరిగింది. గుర్తు తెలియని వ్యక్తి ఒకరు రాయి విసిరారు. ఆ రాయి నేరుగా జగన్ రెడ్డి నుదుటిని తాకింది. దీంతో బలమైన గాయం కావడంతో హుటా హుటిన బస్సులోకి తరలించారు. అక్కడ తాను ఏర్పాటు చేసుకున్న వాహనంలోనే ప్రథమ చికిత్స చేపట్టారు.
ఈ ఘటన కలకలం రేపింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సైతం తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో దాడులకు తావు లేదని పేర్కొన్నారు. జగన్ రెడ్డి త్వరగా కోలుకోవాలని కోరారు. ఇదిలా ఉండగా జాతీయ ఎన్నికల కమిషన్ ఫైర్ అయ్యింది.
ఏపీ సీఎం జగన్ రెడ్డిపై జరిగిన దాడికి సంబంధించి వెంటనే పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. ఈ మేరకు చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ ముకేష్ కుమార్ మీనా స్పందించి వివరాలు ఇవ్వాలని సూచించింది.
ఈసీ ఆదేశాల మేరకు వెంటనే అప్రమత్తం అయ్యారు రాష్ట్ర ఎన్నికల అధికారి (సిఇఓ) . రాష్ట్ర డీజీపీ ఏం జరిగిందనే దానిపై వివరాలు ఇవ్వాలని ఆదేశించారు. ఈ మేరకు డీజీపీ విజయవాడ సీపీని నివేదిక కోరారు.