అమరావతినే ఏపీకి రాజధాని
నారా చంద్రబాబు నాయుడు
అమరావతి – రాష్ట్ర రాజధాని ఏది అనే దానిపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు. ప్రజా గళం పేరుతో ఆయన ప్రచారం చేపట్టారు. ఈ సందర్బంగా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఆరు నూరైనా సరే ఏపీకి అమరావతినే రాష్ట్ర రాజధాని అవుతుందని స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు.
వైసీపీకి అంత సీన్ లేదన్నారు. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి రాచరిక పాలనకు ఇంకా కొన్ని రోజులే మిగిలి ఉన్నాయని పేర్కొన్నారు. రాబోయే కాలం టీడీపీ కూటమిదేనని కుండ బద్దలు కొట్టారు. జగన్ ఎన్ని కుట్రలు పన్నినా, కుతంత్రాలకు తెర లేపినా చివరకు అంతిమ గెలుపు మాత్రం తమదేనని ప్రకటించారు నారా చంద్రబాబు నాయుడు.
వై నాట్ 175 అన్నది రివర్స్ కావడం పక్కా అని తెలిపారు. తమ కూటమికి కనీసం 160కి పైగానే అసెంబ్లీ స్థానాలు వస్తాయని చెప్పారు. ఇక లోక్ సభ వరకు చూస్తే 25 సీట్లకు గాను 23 సీట్లు రాబోతున్నాయని తెలిపారు. మొత్తంగా జగన్ మోహన్ రెడ్డి పెట్టే బేడా సర్దుకుని ఇంటికి వెళ్లడమే ఇక మిగిలి ఉందన్నారు నారా చంద్రబాబు నాయుడు.