కార్యకర్తలే పార్టీకి సైనికులు
ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి
రంగారెడ్డి జిల్లా – చేవెళ్ల పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ రంజిత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే ఎన్నికల రణరంగంలో బూత్ స్థాయిలో ఉన్న కార్యకర్తలే పార్టీకి నిజమైన సైనికులు అని అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన తాండూరు అసెంబ్లీ నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్బంగా జరిగిన బూత్ లెవల్ కార్యకర్తల స్థాయి సమావేశంలో ప్రసంగించారు రంజిత్ రెడ్డి.
అపాయింట్ మెంట్ లేకుండా కలవని నాయకుడికి, రాజకీయంగా రిటైర్మెంట్ ఇచ్చేందుకు ప్రయత్నం చేయాలని పిలుపునిచ్చారు. ఈ చేవెళ్ల గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగుర వేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో చేవెళ్ల పార్లమెంటరీ నియోజకవర్గ ఇంఛార్జి వేం నరేందర్ రెడ్డి, వికారాబాద్ డీసీసీ చీఫ్ , పరిగి ఎమ్మెల్యే టి. రామోహన్ రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డితో కలిసి తాను ప్రచారంలో పాల్గొన్నట్లు చెప్పారు .
తమ పార్టీకి ఢోకా లేదని, ఇక తాను గెలవడం పక్కా అని జోష్యం చెప్పారు రంజిత్ రెడ్డి. ప్రజలు పూర్తిగా ఆరు గ్యారెంటీలపైనే నమ్మకం ఉంచారని , వీటిని అమలు చేస్తున్న తమ సర్కార్ కే ఓటు వేయనున్నట్లు తెలిపారు.