మోదీ నిర్వాకం అతి పెద్ద స్కామ్
నిప్పులు చెరిగిన రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ – ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. ఆయన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పై మండిపడ్డారు. ఈ దేశంలోనే కాదు ప్రపంచంలోనే అతి పెద్ద స్కామ్ కు తెర లేపారంటూ ఆరోపించారు. మోదీ హయాంలో 2018లో తీసుకు వచ్చిన ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు రాహుల్ గాంధీ.
పార్లమెంట్ ఎన్నికల్ ప్రచారంలో భాగంగా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు మోదీ పై. కేవలం తన వ్యక్తిగత ప్రచారానికే ఎక్కువగా సమయం కేటాయించారని, ప్రధానిగా ఆయన పూర్తిగా పాలనా పరంగా ఫెయిల్ అయ్యారంటూ ధ్వజమెత్తారు రాహుల్ గాంధీ.
ప్రపంచ వ్యాప్తంగా ఇవాళ మోదీ సాగించిన అధికారిక అవినీతి కుంభకోణం ఎలక్టోరల్ స్కామ్ పై చర్చ జరుగుతోందని అన్నారు. దీనిపై 143 కోట్ల మంది భారతీయులు ఆలోచించాలని సూచించారు. కేవలం ఈ ఎలక్టోరల్ బాండ్ల ద్వారా భారతీయ జనతా పార్టీకి ఏకంగా రూ. 6,000 కోట్ల అవినీతి సొమ్ము అధికారికంగా చేరిందని ఆరోపించారు.
విచిత్రం ఏమిటంటే ఈ పార్టీకి అనుబంధంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీకి రూ. 900 కోట్లు ఎలా వచ్చాయో చెప్పాలని నిలదీశారు. ఈ మొత్తం స్కామ్ పై విచారణ జరిపించాలని కోరారు రాహుల్ గాంధీ.