ఓవైసీ ముస్లింల అంబానీ
బీజేపీ అభ్యర్థి సంచలన కామెంట్స్
హైదరాబాద్ – బీజేపీ అభ్యర్థి కొంపెల్లి మాధవీలత సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ అభ్యర్థిగా ఆమె బరిలో ఉన్నారు. ప్రస్తుతం ఆమె విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో హోరెత్తిస్తున్నారు. ప్రధానంగా ఇప్పటి దాకా హైదరాబాద్ పై పట్టు కలిగి ఉన్న, ఓటమి ఎరుగని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీతో పోటీ పడుతున్నారు. తనను ఏరికోరి ఎంపిక చేసినందుకు ఎలాగైనా సరే గెలవాలనే ఉద్దేశంతో పట్టుదలతో ముందుకు సాగుతున్నారు.
ఆమె ఇంటింటికీ తిరుగుతూ ప్రచారాన్ని చేపట్టారు. ఈ సందర్బంగా తన ప్రత్యర్థి అభ్యర్థి అయిన ఎంఐఎం చీఫ్ ఓవైసీపై నిప్పులు చెరిగారు. తాను గెలిస్తే వెంటనే వక్ఫ్ బోర్డు పరిధిలోని భూములను తిరిగి స్వాధీనం చేసుకుంటామని ప్రకటించారు.
హైదరాబాద్ పేరును తిరిగి భాగ్యనగరంగా మారుస్తామని చెప్పారు కొంపెల్లి మాధవీలత. ఈ సందర్బంగా మరో సంచలన కామెంట్ చేశారు. ముస్లింలకు ఓవైసీ ప్రతినిధి అని చెప్పుకుంటున్నాడని కాదన్నారు. ఆయన ముస్లింలలో మరో అంబానీగా కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీతో సోదర సంబంధాలు మరింత బలపడుతున్నాయంటూ ఎద్దేవా చేశారు.