ఉత్కంఠ పోరులో రాజస్థాన్ విక్టరీ
మ్యాచ్ ను గెలిపించిన హెట్ మైర్
ముల్లాన్ పూర్ – ఐపీఎల్ 2024లో భాగంగా ముల్లాన్ పూర్ స్టేడియంలో జరిగిన కీలక మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగింది. చివరి బంతి వరకు ఎవ\రు గెలుస్తారో చెప్పలేని పరిస్థితి . ఓ వైపు ఇరు జట్లు విజయం కోసం కష్టపడ్డాయి. కానీ సమిష్టిగా రాణించడంతో రాజస్థాన్ రాయల్స్ జయ కేతనం ఎగుర వేసింది. ప్రధానంగా స్వల్ప స్కోర్ టార్గెట్ ఉన్నా బంతి అంతకంతకూ టర్న్ అవుతుండడంతో పరుగులు చేయడం ఇబ్బందిగా మారింది.
ఎప్పుడైతే సంజూ శాంసన్ వెనుదిరిగాడో ఇక మ్యాచ్ పూర్తిగా పంజాబ్ కింగ్స్ ఎలెవన్ చేతిలోకి వెళ్లి పోయింది. పూర్తిగా కట్టడి చేశాడు తాత్కాలిక కెప్టెన్ శామ్ కరన్. ఈ మ్యాచ్ కు దూరంగా ఉన్నాడు రెగ్యులర్ కెప్టెన్ శిఖర్ ధావన్.
చివరి దాకా పోరాడుతూ వచ్చిన పంజాబ్ గెలుస్తుందని అంతా అనుకున్నారు. కానీ విండీస్ విధ్వంసకర బ్యాటర్ సిమ్రోన్ హిట్ మైర్ అరివీర భయంకరమైన ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 10 బంతులు మాత్రమే ఎదుర్కొని 27 కీలక పరుగులు చేశాడు. దీంతో రాజస్థాన్ సెన్సేషన్ విక్టరీ సాధించింది.
ముందుగా బ్యాటింగ్ కు దిగిన పంజాబ్ కింగ్స్ ఎలెవన్ నిర్ణీత 20 ఓవర్లలో 147 రన్స్ చేసింది. ప్రధానంగా శాంసన్ ఫీల్డింగ్ అద్భుతం అని చెప్పక తప్పదు. ఇప్పటి వరకు ఆరు మ్యాచ్ లు ఆడితే 5 మ్యాచ్ లలో గెలుపొందింది రాజస్థాన్ రాయల్స్.
కేశవ్ మహరాజ్ 23 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీస్తే అవేష్ ఖాన్ 34 రన్స్ ఇచ్చి 2 తీశాడు. 8 వికెట్లు కోల్పోయింది తక్కువ స్కోర్ చేసింది. ఆఖరులో వచ్చిన అశుతోష్ శర్మ 16 బంతుల్లో 31 రన్స్ చేశాడు . ఒక ఫోర్ 3 సిక్స్ లు కొట్టాడు.
అనంతరం బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ లో జైశ్వాల్ 39 రన్స్ చేస్తే హెట్ మైర్ ఆఖరులో సత్తా చాటాడు.