SPORTS

సంజూ శాంస‌న్ సెన్సేష‌న్

Share it with your family & friends

లివింగ్ స్టోన్ కు బిగ్ షాక్

ముల్లాన్ పూర్ – ఐపీఎల్ 2024లో భాగంగా పంజాబ్ కింగ్స్ తో జ‌రిగిన కీల‌క లీగ్ మ్యాచ్ లో ఆస‌క్తిక‌ర స‌న్నివేశాలు చోటు చేసుకున్నాయి. ముందుగా బ్యాటింగ్ కు దిగిన పంజాబ్ ను 147 ప‌రుగుల‌కే క‌ట్ట‌డి చేశారు రాజ‌స్థాన్ రాయ‌ల్స్ .

ప్ర‌ధానంగా కేశ‌వ్ మ‌హ‌రాజ్ , అవేశ్ ఖాన్ లు అద్భుత‌మైన బౌలింగ్ తో ఆక‌ట్టుకున్నారు. ఇద్ద‌రూ చెరో రెండు వికెట్లు తీశారు. ఇక ప్ర‌త్యేకంగా చెప్పు కోవాల్సింది కేర‌ళ స్టార్ క్రికెట‌ర్ కెప్టెన్ సంజూ శాంస‌న్. లియామ్ లివింగ్ స్టోన్ కుదురుకుని ప‌రుగులు చేస్తున్న స‌మ‌యంలో బిగ్ షాట్ కొట్టాడు.

గ్రౌండ్ లో ఉన్న రాజ‌స్థాన్ ప్లేయ‌ర్ వేగంగా బంతిని వికెట్ కీప‌ర్ స్థానంలో ఉన్న సంజూ శాంస‌న్ కు ఇచ్చాడు. ఆ వెంట‌నే బంతిని వికెట్లకు వేయ‌డంతో లివింగ్ స్టోన్ పెవిలియ‌న్ దారి ప‌ట్టాల్సి వ‌చ్చింది. క‌ళ్లు తెరిచే లోపే ర‌నౌట్ చేశాడు సంజూ శాంస‌న్. స్టేడియంలో కూర్చున్న వేలాది మంది ప్రేక్ష‌కులు సైతం విస్తు పోయారు.

త‌నుష్ కోటియ‌న్ నుండి బంతి అందుకున్న వెంట‌నే స్టంప్ ల కేసి కొట్టాడు. ఒక ర‌కంగా ఆనాటి మ‌హేంద్ర సింగ్ ధోనీ వికెట్ కీపింగ్ ను త‌ల‌పించేలా చేసింది ఈ ర‌నౌట్ అని క్రికెట్ విశ్లేష‌కులు పేర్కొంటున్నారు. ప్ర‌స్తుతం నెట్టింట్లో సంజూ శాంస‌న్ వైర‌ల్ గా మారాడు.