ఓటరుగా నమోదు చేసుకోండి
నేటితో ముగియనున్న డెడ్ లైన్
అమరావతి – ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాసన సభ, లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ తరుణంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. ఇప్పటికే ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా సీఈసీ ఆదేశాల మేరకు ఏపీ రాష్ట్ర ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేష్ కుమార్ మీనా కీలక ప్రకటన చేశారు.
ఇప్పటి వరకు ఓటు హక్కు వినియోగించుకోని వారు, ఓటరుగా నమోదు చేసుకోని వారికి అరుదైన అవకాశం ఇచ్చారు. ఇందులో భాగంగా ఎన్నికల సంఘానికి సంబంధించిన వెబ్ సైట్ ద్వారా ఆయా జిల్లా కేంద్రాల కార్యాలయాలతో పాటు ఈసీ యాప్ ను ఉపయోగించు కోవడం ద్వారా కొత్తగా ఓటరుగా నమోదు చేసుకోవచ్చని ఇప్పటికే ప్రకటించారు.
ఇందులో భాగంగా ఓటరు నమోదు కోసం ఏప్రిల్ 15 డెడ్ లైన్ విధించారు. సోమవారం నాటితో ఓటరు నమోదు కార్యక్రమం ముగియనుంది. ఈ మేరకు ఎవరైనా ఇప్పటి దాకా నమోదు చేసుకోనట్లయితే వెంటనే నమోదు చేసుకోవాలని సూచించారు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ మీనా.