నేతల కామెంట్స్ బుగ్గన సీరియస్
ప్రజాస్వామ్యంలో దాడులు సరికాదు
అమరావతి – ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా ప్రతిపక్షాలపై తీవ్ర స్తాయిలో మండిపడ్డారు. విజయవాడలో సీఎం జగన్ మోహన్ రెడ్డిపై రాళ్లతో దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. డెమోక్రసీలో దాడులు సరికాదన్నారు.
అసలు ఎక్కడికి వెళుతున్నామో తెలియడం లేదన్నారు. రాజకీయాలలో విమర్శలు, ఆరోపణలు సర్వ సాధారణమని కానీ దాడుల దాకా వెళ్లడం భావ్యం కాదన్నారు. ఇది పూర్తిగా అప్రజాస్వామికమని పేర్కొన్నారు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి.
ప్రతిపక్ష పార్టీలతో కూడిన కూటమి నేతలు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ , పురందేశ్వరి లు వాడుతున్న భాష పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తిని పట్టుకుని ఏక వచనంతో సంబోదించడం సరికాదన్నారు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి. కళ్లకు, తలకు గాయాలు అయ్యేలా ఎవరైనా స్వంతంగా రాళ్లు వేయించుకుంటారా అని ప్రశ్నించారు.
చిల్లర రాజకీయాలు , నిరాధారమైన ఆరోపణలు చేయడం విపక్ష నేతలకు అలవాటుగా మారిందన్నారు బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి.