NEWSNATIONAL

స‌బ్ కే సాథ్ గ్యారెంటీ – మోదీ

Share it with your family & friends

ప్ర‌జా సంక్షేమ‌మే ప్ర‌భుత్వ ల‌క్ష్యం

న్యూఢిల్లీ – భార‌త దేశంలో ఎన్నిక‌ల వేడి మ‌రింత రాజుకుంది. ఎక్క‌డ చూసినా జ‌నం తండోప తండాలుగా త‌ర‌లి వ‌స్తున్నారు. ఈసారి సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో స‌త్తా చాటాల‌ని భార‌తీయ జ‌న‌తా పార్టీ కంక‌ణం కట్టుకుంది. ఇప్ప‌టికే ఆ పార్టీ అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేసింది. ఎలాగైనా స‌రే ఇటు నార్త్ అటు సౌత్ లో క్లీన్ స్వీప్ చేసేందుకు వ్యూహాలు ప‌న్నుతోంది. ప్ర‌ధానంగా కేంద్ర హోం శాఖ మంత్రి, ట్ర‌బుల్ షూట‌ర్ గా పేరు పొందిన అమిత్ చంద్ర షా అన్నీ తానై వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

తాజాగా కేంద్ర ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఆధ్వ‌ర్యంలో బీజేపీ మేనిఫెస్టోను విడుద‌ల చేశారు ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ. రేప‌టి భ‌విష్య‌త్తు కోసం గ్యాన్ పేరుతో తాము రూపొందించిన‌ట్లు ప్ర‌క‌టించారు. గ్యాన్ అంటే గ‌రీబ్ , యువ‌, అన్న‌దాత‌, నారీమ‌ణి అని అర్థమ‌ని చెప్పారు మోదీ.

3 కోట్ల‌కు పైగా ఇళ్ల‌ను నిర్మిస్తామ‌ని, 70 ఏళ్ల లోపు ప్ర‌తి ఒక్క‌రికీ ఆయుష్మాన్ ప‌థ‌కాన్ని అమలు చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. మ‌రో ఐదేళ్ల‌పాటు ఉచితంగా రేష‌న్ , యూనిఫామ్ సివిల్ కోడ్, ఒన్ నేష‌న్ వ‌న్ ఓటును తీసుకు వ‌స్తామ‌ని స్ప‌ష్టం చేశారు. 2036లో ఒలింపిక్స్ నిర్వ‌హించేందుకు ప్లాన్ చేస్తామ‌న్నారు. మొత్తంగా స‌బ్ కే సాథ్ గ్యారెంటీ ఇస్తున్న‌ట్లు తెలిపారు.