SPORTS

రాజస్థాన్ తో ప‌దేళ్ల బంధం

Share it with your family & friends

మ‌రిచి పోలేన‌న్న శాంస‌న్

రాజ‌స్థాన్ – కేర‌ళ స్టార్ క్రికెట‌ర్ , ప్ర‌స్తుత రాజ‌స్థాన్ రాయ‌ల్స్ కెప్టెన్ సంజూ శాంస‌న్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. 19 ఏళ్ల వ‌య‌సు ఉన్న స‌మ‌యంలో తాను రాజ‌స్థాన్ జ‌ట్టుకు ఎంపిక‌య్యాన‌ని చెప్పారు. సంజూ శాంస‌న్ స్టార్ స్పోర్ట్స్ తో జ‌రిగిన చిట్ చాట్ లో ప‌లు అంశాలు పంచుకున్నారు. తాను రాజ‌స్థాన్ తో కొన‌సాగిస్తున్న ప్ర‌యాణం ఈ ఏడాదితో 10 ఏళ్లు పూర్త‌యింద‌ని చెప్పాడు సంజూ శాంస‌న్ .

ఆనాడు కేర‌ళ నుంచి శ్రీ‌శాంత్ తో పాటు తాను కూడా ట్ర‌య‌ల్స్ కు హజ‌ర‌య్యాన‌ని తెలిపాడు. అప్పుడు జ‌ట్టుకు కెప్టెన్ గా ఉన్న రాహుల్ ద్ర‌విడ్ త‌న‌ను ఎంపిక చేశాడ‌ని, కానీ చాలా స్పోర్టివ్ గా త‌న‌కు స‌ల‌హాలు, సూచ‌న‌లు ఇస్తూ వ‌చ్చాడ‌ని కొనియాడారు.

పిలిచిన వెంట‌నే త‌న పెళ్లికి కూడా హాజ‌ర‌య్యాడ‌ని చెప్పాడు సంజూ శాంస‌న్. ఆయ‌న నుంచి ఎన్నో నేర్చు కోవాల్సిన‌వి ఉన్నాయ‌ని పేర్కొన్నాడు. ఒక‌ప్పుడు ఇదే జ‌ట్టులో నేను స‌భ్యుడిగా ఉన్నా..ఇవాళ రాజ‌స్థాన్ రాయ‌ల్స్ జ‌ట్టుకు నాయ‌క‌త్వం వ‌హిస్తుండ‌డం అదృష్టంగా భావిస్తున్న‌ట్లు స్ప‌ష్టం చేశాడు ఈ కేర‌ళ స్టార్. ప్ర‌స్తుతం త‌ను చేసిన కామెంట్స్ వైర‌ల్ గా మారాయి.