NEWSTELANGANA

క‌విత గీత దాటొద్దు – కోర్టు

Share it with your family & friends

మీడియాతో ఎలా మాట్లాడ‌తారు

న్యూఢిల్లీ – ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ కేసులో తీవ్ర ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌వితకు బిగ్ షాక్ త‌గిలింది. కోర్టు ప్రాంగ‌ణంలో ఆమె మీడియాతో మాట్లాడ‌టాన్ని తీవ్రంగా త‌ప్పు ప‌ట్టింది. ఇది చ‌ట్టాన్ని ఉల్లంఘించ‌డ‌మే అవుతుంద‌ని పేర్కొంది. ఇంకోసారి కోర్టు స‌ముదాయంలో ఎవ‌రు మాట్లాడినా చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రించింది .

ఇదిలా ఉండ‌గా లిక్క‌ర్ స్కామ్ కేసుకు సంబంధించి ఏప్రిల్ 23 వ‌ర‌కు కోర్టు జ్యుడీషియ‌ల్ క‌స్ట‌డీ విధించింది సీబీఐ కోర్టు. ఈ మేర‌కు సంచ‌ల‌న తీర్పు వెలువ‌రించింది. అయితే అంత‌కు ముందు క‌ల్వ‌కుంట్ల క‌విత భార‌తీయ జ‌న‌తా పార్టీపై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ఇది సీబీఐ క‌స్ట‌డీ కాద‌ని బీజేపీ క‌స్ట‌డీ అంటూ మండిప‌డ్డారు.

తాను ఏ త‌ప్పు చేయ‌లేద‌న్నారు. తాను ఎలాంటి అక్ర‌మాల‌కు పాల్ప‌డ‌లేద‌ని , కావాల‌ని త‌న‌ను ఇరికించారంటూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఏదో ఒక‌రోజు నిజాయితీగా బ‌య‌ట‌కు వ‌స్తాన‌ని ప్ర‌క‌టించారు. కొంద‌రు కావాల‌ని త‌న‌పై దుష్ప్ర‌చారం చేస్తున్నారంటూ మండిప‌డ్డారు.

నిజం అనేది నిల‌క‌డ మీద తేలుతుంద‌న్నారు క‌ల్వ‌కుంట్ల క‌విత‌. ఇక మీడియా ప‌రంగా బ‌య‌ట మాట్లాడుకుంటే బెట‌ర్ అని కోర్టు సూచించింది ఎమ్మెల్సీకి.