గాడి తప్పిన మోదీ పాలన
ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి
రాజస్థాన్ – నరేంద్ర మోదీ పాలన పూర్తిగా గాడి తప్పిందని నిప్పులు చెరిగారు ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాందీ వాద్రా. సోమవారం పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజస్థాన్ లో పర్యటించారు. ఈ సందర్బంగా భారీ ఎత్తున కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రోడ్ షో చేపట్టారు. జనం ఊహించని రీతిలో తరలి వచ్చారు. ప్రియాంక గాంధీకి అభివాదం చేశారు. వారంతా మీకు సహకారం చేస్తామని మాటిచ్చారు.
అశేష జనవాహినిని చూసి సంతోషానికి లోనయ్యారు ప్రియాంక గాందీ వాద్రా. అల్వార్ ప్రజలు కనబర్చిన ఈ ఆదరాభిమానాలు వచ్చే ఎన్నికల దాకా ఇలాగే ఉండాలని కోరారు. రాబోయే మార్పునకు ఇది సంకేతంగా నిలుస్తుందన్నారు.
కాంగ్రెస్ పార్టీకి భారీ మెజారిటీ వచ్చేలా చేయాలన్నారు. రాజస్థాన్ లో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని ఇది కీలకంగా మారనుందన్నారు. ప్రధాన మంత్రి మోదీ అబద్దాలు చెప్పడంలో నెంబర్ వన్ అని ఎద్దేవా చేశారు. బీజేపీ విడుదల చేసిన మేనిఫెస్టో కేవలం ప్రజలకు దూరంగా ఉందని ధ్వజమెత్తారు. ఆ పార్టీకి పెట్టుబడిదారులు తప్ప ప్రజలు కనిపించరని అన్నారు.