NEWSNATIONAL

కేజ్రీవాల్ కు షాక్ క‌స్ట‌డీ పొడిగింపు

Share it with your family & friends

ఈనెల 23 వ‌ర‌కు పొడిగించిన కోర్టు

న్యూఢిల్లీ – ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ కేసులో తీవ్ర‌మైన ఆరోప‌ణ‌లు ఎదుర్కొని ప్ర‌స్తుతం తీహార్ జైలు నుంచే ప‌రిపాల‌న సాగిస్తున్న ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ కు బిగ్ షాక్ త‌గిలింది. ఈ కేసుకు సంబంధించి సోమ‌వారం విచార‌ణ చేప‌ట్టింది కోర్టు. ఈ సంద‌ర్బంగా కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. త‌న అరెస్ట్ అన్యాయ‌మ‌ని, ఇది పూర్తిగా క‌క్ష సాధింపు త‌ప్ప మ‌రోటి కాద‌ని కేజ్రీవాల్ త‌ర‌పు న్యాయ‌వాది వాదించారు. ఇందుకు సంబంధించి అత్య‌వ‌స‌ర పిటిష‌న్ ను విచారించాల‌ని కోరారు.

దీనిపై విచారించిన సుప్రీంకోర్టు ఏప్రిల్ 29 వ‌ర‌కు వాయిదా వేస్తున్న‌ట్లు స్పష్టం చేసింది. కాగా కేసుకు సంబంధించి అర‌వింద్ కేజ్రీవాల్ నిజాలు చెప్ప‌డం లేద‌ని, ప్ర‌ధానంగా తాను వాడిన ఐఫోన్ కు సంబంధించిన పాస్ వ‌ర్డ్ ఇవ్వ‌డం లేద‌ని విచార‌ణ స‌మ‌యంలో కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ సీబీఐ, ఈడీ ఆరోపించింది. ఆయ‌న నుంచి నిజాలు రాబ‌ట్టాలంటే త‌మ‌కు క‌ష్టడీ ఇవ్వాల‌ని కోరింది.

దీంతో విచార‌ణ అనంత‌రం కోర్టు క‌స్ట‌డీ పొడిగిస్తున్న‌ట్లు పేర్కొంది. ఈ కేసులో మ‌రో కీల‌క నాయ‌కురాలు మాజీ సీఎం కేసీఆర్ , కూతురు ఎమ్మెల్సీ క‌విత‌కు కూడా ఈనెల 23 వ‌ర‌కు క‌స్ట‌డీ పొడిగించింది. ఇది సీబీఐ క‌స్ట‌డీ కాద‌ని బీజేపీ క‌స్ట‌డీ అంటూ ఆరోపించింది.