NEWSANDHRA PRADESH

రాయి దాడి నాపైకి తోస్తే ఎలా

Share it with your family & friends

చంద్ర‌బాబు నాయుడు ఫైర్

అమ‌రావ‌తి – ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని ఏకి పారేశారు టీడీపీ చీఫ్ , మాజీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా సోమ‌వారం నిర్వ‌హించిన ప్రజా గ‌ళం స‌భ‌లో ఆయ‌న ప్ర‌సంగించారు. విచిత్రం ఏమిటంటే రాష్ట్రంలో అధికారంలో ఉన్న‌ది నువ్వా నేనా అని నిల‌దీశారు. అధికార యంత్రాంగం, పోలీసులు అంతా నీ చేతుల్లోనే ఉన్నార‌ని మ‌రి ఎవ‌రు దాడికి పాల్ప‌డ్డారో ఇప్ప‌టి వ‌ర‌కు ఎందుకు ఛేదించ లేక పోయారో చెప్పాల‌ని డిమాండ్ చేశారు.

చిల్ల‌ర రాజకీయాలు చేయ‌డం జ‌గ‌న్ రెడ్డికి ఆయ‌న ప‌రివారానికి అల‌వాటుగా మారింద‌ని మండిప‌డ్డారు. తాను ఓడి పోతాన‌ని ప్ర‌జ‌ల నుంచి ఓట్లు రాబ‌ట్టేందుకు రాయి దాడి నాట‌కం ఆడారంటూ ఎద్దేవా చేశారు. త‌మ‌పై రాళ్లు రువ్వుతున్న‌ది ఎవ‌రో జ‌నాల‌కు బాగా తెలుస‌న్నారు. మొన్న‌టికి మొన్న కోడి క‌త్తి డ్రామా ఆడింది నువ్వు కాదా జ‌గ‌న్ అంటూ నిప్పులు చెరిగారు నారా చంద్ర‌బాబు నాయుడు.

ప్ర‌స్తుతం తాను ఓడి పోతున్నాన‌ని తెలిసి చివ‌ర‌కు చిన్నాన్న వైఎస్ వివేకానంద పై గొడ్డ‌లి వేటు కూడా త‌న‌కు అనుకూలంగా మ‌ల్చుకునేందుకు డ్రామాలు ఆడారంటూ ఫైర్ అయ్యారు. చివ‌ర‌కు దానిని కూడా త‌న మీద‌కు తోసేశావంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇక నుంచి నీ డ్రామాలు సాగ‌వ‌న్నారు. రాబోయే రోజుల్లో జ‌గ‌న్ రెడ్డి ఇంటికి వెళ్ల‌డం ఖాయ‌మ‌న్నారు.