ఏపీలో గాడి తప్పిన పాలన
ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల
అమరావతి – ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి సారథ్యంలోని వైసీపీ పాలన అస్తవ్యస్తంగా తయారైందని ఆరోపించారు ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల. ఏపీ న్యాయ యాత్రలో భాగంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొని ప్రసంగించారు. ఆమె జీడీ నెల్లూరు, పలమనేరు, పూతలపట్టు నియోజకవర్గాలలో పర్యటించారు. ఈ సందర్బంగా భారీ ఎత్తున తరలి వచ్చారు ప్రజానీకం. తనపై మండు టెండలో సైతం నిలబడి ఆదరించినందుకు ధన్యవాదాలు తెలియ చేసుకుంటున్నానని అన్నారు వైఎస్ షర్మిల.
రాష్ట్రంలో పేదలు, బడుగు, బలహీన, మైనార్టీలు బతికే పరిస్థితులు లేవన్నారు. దివంగత మాహా నేత వైఎస్సార్ ఆశయాలకు తిలోదకాలు ఇచ్చారంటూ సీఎంపై ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఎవరికి ఓటు వేసినా అది భారతీయ జనతా పార్టీకి వేసినట్టేనని అన్నారు. ప్రజలు విజ్ఞతతో తమ ఓటును కాంగ్రెస్ పార్టీకి వేయాలని ఆమె కోరారు.
తమను గెలిపిస్తే వైఎస్సార్ పాలనను అందిస్తానని, రాజన్న రాజ్యం తీసుకు వస్తానని, ఏపీకి ప్రత్యేక హోదా తీసుకు వచ్చేందుకు కృషి చేస్తానని, అప్పటి దాకా నిద్ర పోనని స్పష్టం చేశారు వైఎస్ షర్మిల.