బీజేపీ ఎంపీ తేజస్విపై కేసు
డిపాజిటర్లను బెదిరించారు
కర్ణాటక – భారతీయ జనతా పార్టీ ఎంపీ తేజస్వి సూర్యకు బిగ్ షాక్ తగిలింది. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఆయనపై కేసు నమోదైంది. ఈ మేరకు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు దక్షిణ బెంగళూరుకు ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న తేజస్వి సూర్యపై కేసు నమోదు చేశారు పోలీసులు.
రాఘవేంద్ర కో ఆపరేటివ్ బ్యాంకుకు సంబంధించి డిపాజిట్లు సేకరించారు. నష్ట పోయిన వారికి డబ్బులు ఇప్పిస్తానంటూ ఎంపీ తో పాటు తండ్రి కూడా హామీ ఇచ్చారు. దీంతో తమకు న్యాయం చేయాలని కోరుతూ డిపాజిటర్లు పెద్ద ఎత్తున నిలదీశారు. ఆందోళన చేపట్టారు. తండ్రీ కొడుకులు కలిసి బాధితుల గోడు పట్టించు కోలేదు. ఆపై వారిపై తీవ్ర స్థాయిలో దుర్భాషలాడారు. ఈ సమయంలో దీనిని రికార్డు చేస్తున్న వారిపై నానా దుర్భాష లాడారు. ఆపై వారిపై దాడి చేసేందుకు ప్రయత్నం చేశారు ఎంపీ తేజస్వి సూర్య, ఆయన తండ్రి.
బసవనగుడిలోని గురు రాఘవేంద్ర సహకార బ్యాంకులో జరిగిన కోట్లాది రూపాయల కుంభకోణంలో నష్టపోయిన పలువురు పెట్టుబడిదారులు, బాధితులకు నష్టపరిహారం ఇస్తామని గతంలో హామీ ఇచ్చారు తేజస్వి సూర్య. ఆయన ఎమ్మెల్యే మామ రవి సుబ్రమణ్యంను నిలదీశారు.