డబ్బున్నోళ్లకే బాబు టికెట్లు
ఎంపీ విజయ సాయి రెడ్డి
అమరావతి – వైసీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మరోసారి టీడీపీ చీఫ్ , మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడుపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించారు. నోరు తెరిస్తే అబద్దాలు తప్ప నిజాలు చెప్పిన దాఖలాలు లేవన్నారు ఎంపీ.
తాను పేదల పక్షమైతే…చంద్రబాబు పెత్తందారుల ప్రతినిధి అని సిఎం జగన్ ఇన్నాళ్లు అంటున్నది నిజం చేసి చూపించారు బాబు. అంటూ ఎద్దేవా చేశారు అన్నట్టుగానే చంద్రబాబు నాయుడు , ఆయన కూటమి పార్టీలు డబ్బున్న వాళ్లకు, ఎన్నారైలకు టికెట్లిచ్చాయని ధ్వజమెత్తారు.
కానీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్లో కనీసం సొంత ఇల్లు లేనివారు కూడా ఉన్నారన్న విషయం గుర్తు పెట్టుకోవాలని అన్నారు ఎంపీ విజయ సాయి రెడ్డి. టిప్పర్ డ్రైవర్ అని మీరు చులకన చేసి మాట్లాడిన శింగనమల వీరాంజనేయులు అందులో ఒకరు అని స్పష్టం చేశారు. ఇది క్లాస్ వార్ కాక మరేమిటి బాబూ అంటూ ఎద్దేవా చేశారు.
ఈసారి జరగబోయే ఎన్నికల్లో టీడీపీ కూటమి అడ్రస్ లేకుండా పోవడం ఖాయమని జోష్యం చెప్పారు విజయ సాయి రెడ్డి.