సీట్లు అమ్ముకున్న చంద్రబాబు
మాజీ ఎమ్మెల్యే వీర శివా రెడ్డి
కడప జిల్లా – మాజీ ఎమ్మెల్యే వీర శివా రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఆయన టీడీపీ చీఫ్ , మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మంగళవారం వీర శివా రెడ్డి మీడియాతో మాట్లాడారు.
అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో సీట్లు ఇచ్చేందుకు బేరం పెట్టాడని, ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే వారికి టికెట్లు కేటాయించారంటూ ధ్వజమెత్తారు. కడప జిల్లాలో టీడీపీ అడ్రస్ లేకుండా పోతుందని అన్నారు. ఉమ్మడి కడప జిల్లాల్లోని 10 సీట్లలో ఒక్క సీటు కూడా తెలుగుదేశం పార్టీకి రాదన్నారు వీర శివా రెడ్డి.
సీనియార్టీని కాదని చంద్రబాబు డబ్బులకే అధిక ప్రాధాన్యత ఇచ్చాడని ఆరోపించారు. కమలాపురం నియోజకవర్గంలో నాలుగు సార్లు ఓడి పోయిన కుటుంబానికి టికెల్ ఎలా ఇస్తారంటూ నారా చంద్రబాబు నాయుడును ప్రశ్నించారు. తాను ఎమ్మెల్యేగా మూడు సార్లు గెలిచానని, జనంలో తనకు ఆదరణ ఉన్నా పట్టించు కోలేదన్నారు.
బాబుకు విజన్ ఉందని అనుకున్నా, కానీ ఇలా డబ్బులకు అమ్ముడు పోతాడని అనుకోలేదన్నారు వీర శివా రెడ్డి. విలువ లేని పార్టీలో ఒక్క క్షణం కూడా ఉండలేనని అన్నారు. త్వరలోనే తాను కార్యాచరణ ప్రకటిస్తానని చెప్పారు.