కోర్టుకు హాజరైన రామ్ దేవ్ బాబా
ఎండీ ఆచార్య బాలకృష్ణ
న్యూఢిల్లీ – యోగా గురు రామ్ దేవ్ బాబా తో పాటు పతంజలి మేనేజింగ్ డైరెక్టర్ ఆచార్య బాలకృష్ణపై సుప్రీంకోర్టు సీరియస్ అయ్యింది. అసంబద్ద ప్రకటనలతో ప్రజలను మోసం చేస్తున్నారని, కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నారని ఇండియన్ మెడికల్ కౌన్సిల్ (ఐఎంసీ) ఫిర్యాదు చేసింది. ఈ మేరకు దీనికి సంబంధించి కేసు పిటిషన్ దాఖలు అయ్యింది.
మంగళవారం ఈ కేసుకు సంబంధించి భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయ స్థానం సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభమైంది. ఈ సందర్భంగా పతంజలి యోగా రామ్ దేవ్ బాబాతో పాటు ఆచార్య బాలకృష్ణ హాజరయ్యారు.
తప్పుదోవ పట్టించే ప్రకటనలు ఇవ్వడం పూర్తిగా చట్ట విరుద్దమని పేర్కొంది. ఒక బాధ్యత కలిగిన స్థాయిలో ఉన్న వారు ఎలా ఇలా చేస్తారంటూ ధర్మాసనం ప్రశ్నించింది. యోగా పేరుతో, ఆయుర్వేదం పేరుతో పక్కదారి పట్టించడం మంచి పద్దతి కాదని అభిప్రాయ పడింది.
ఒక స్థాయిలో ఆదర్శ ప్రాయంగా ఉండాల్సిన వాళ్లు ఇలా పక్కదారి పట్టించేలా ప్రవర్తించడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించింది ధర్మాసనం. ఈ రకంగా చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. మొత్తంగా