త్రివేండ్రంలో కాంగ్రెస్ దే జెండా
డిప్యూటీ సీఎం డీకే శివకుమార్
కేరళ – కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ స్టార్ క్యాంపెయినర్ గా మారారు. ఆయన కర్ణాటకలో ట్రబుల్ షూటర్ గా పేరు పొందారు. బీజేపీ సర్కార్ ను పడగొట్టడంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వపు వైభవాన్ని తీసుకు రావడంలో , అధికారంలోకి వచ్చేలా చేయడంలో కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం కర్ణాటకతో పాటు ఏపీ, కేరళ, తమిళనాడు, తదితర రాష్ట్రాలలో కూడా ఏఐసీసీ కీలకమైన నేతలను ప్రచారంలో పాల్గొనేలా ప్లాన్ చేసింది.
తాజాగా మంగళవారం ప్రముఖ వక్త, రచయిత, అనలిస్ట్ , కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు శశి థరూర్ కు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో త్రివేండ్రంలో చేపట్టిన భారీ రోడ్ షో, ర్యాలీలో డీకే శివకుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారీ ఎత్తున హాజరైన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. శశి థరూర్ క్రమశిక్షణ కలిగిన నాయకుడని కొనియాడారు.
ఆయన అపరిమితమైన విషయ పరిజ్ఞానం కలిగిన వ్యక్తి అని, ఇలాంటి నాయకుడు పార్లమెంట్ లో మాట్లాడేందుకు చాలా అవసరమని పేర్కొన్నారు. ఈ సందర్బంగా మరోసారి త్రివేండ్రమ్ లో శశి థరూర్ గెలుపొందడం ఖాయమని, కాంగ్రెస్ జెండా రెప రెప లాడాలని పిలుపునిచ్చారు డీకే శివకుమార్.