సినిమాకు సామాజిక బాధ్యత ఉంటుందని నమ్మిన దర్శకులలో సత్యజిత్ రే ఒకడు. ఆయన బాటలో చాలా మంది నడిచారు. ఇంకా నడుస్తూనే ఉన్నారు. ఎందరో భారతీయ వెండి తెర మీద అద్భుతాలను ఆవిష్కరించారు. ఇంకా చేస్తూనే ఉన్నారు. ఆ మహానుభావుడి పేరు మీద వెలసిన సంస్థలో చేరేందుకు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది పోటీ పడుతుంటారు. ఈ సినీ క్యాన్వాస్ ను తెలుసుకునే ప్రయత్నం చేసేందుకు. ఈ జర్నీ కష్టంతో కూడుకుని ఉన్నది. ఒడిదొడుకులతో కూడుకుని ఉన్నది. అయినా ఎక్కడా ఆ ప్రయత్నం మానుకునేది లేదంటూ ఓ బృందం చేసిన చిన్నపాటి కృషితో లోకం ముందుకు వచ్చిన లఘు చిత్రం ఎ డాల్ మేడ్ అప్ ఆఫ్ క్లే. కలల్ని సాకారం చేసుకునేందుకు ఓ ఆటగాడు చేసిన ప్రయాణం.
ఏకంగా కేన్స్ ఫిలిం ఫెస్టివల్ కు భారతదేశం తరపున ఎన్నికైన ఏకైక షార్ట్ ఫిలిం.
కేవలం 23 నిమిషాల నిడివి కలిగి ఉంది. కానీ ప్రారంభం నుంచి ముగింపు దాకా మనల్ని ఓ పట్టాన ఉండనీయదు. మనలోపటి భావోద్వేగాలను సుతిమెత్తగా తడుముతుంది. కన్నీళ్లు కార్చేలా చేస్తుంది.
సమున్నత ఆశయంతో నడిచే ఓ యువ నైజీరియన్ అథ్లెట్ ఇండియాకు వస్తాడు. ప్రొఫెషనల్ ఫుట్ బాల్ క్రీడాకారుడు కావాలని కోరుకుంటాడు. తన కలను సాకారం చేసేందుకు తండ్రి తనకు ఉన్న కొద్దిపాటి భూమిని అమ్మేస్తాడు. కెరీర్ ను ముగించే లోపు తెలియని దేశంలో చిక్కుకు పోయేలా చేస్తుంది. శారీరకమైన బాధ, భావోద్వేగంతో కూడుకున్న గాయం, వెరసి తన పూర్వీకుల ఆధ్యాత్మిక సంప్రదాయాలతో తిరిగి కలుసుంటాడు. ఎ డాల్ మేడ్ అప్ ఆఫ్ క్లే అనేది స్థాన భ్రంశానికి చెందినది. సాంస్కృతిక స్థితి స్థాపకతను తెలియ చేస్తుంది.
ఈ జర్నీలో తను ఏం సాధించాడు..ఏం కోల్పోయాడు..ఈ మధ్య కాలంలో తను పడిన మానసిక వేదన, ప్రతిస్పందనల్నీ ఈ కొన్ని నిమిషాల వ్యవధిలో చెప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు ఇథియోపియన్ స్టూడెంట్ కోకోబ్ గెబ్రెహ వేరియా టెస్నే. దీనిని సత్యజిత్ రే ఫిలిం ఇనిస్టిట్యూట్ ద్వారా సాహిల్ మనోజ్ ఇంగ్లే నిర్మించాడు. హిమాంగ్షు సైకిహ్ సంగీతం అందించాడు. ఎగ్జిక్యూటివ్ నిర్మాతలుగా ఉమా కుమారి, రోహిత్ కోడేరే వ్యవహరించారు. ప్రధాన నటుడిగా నైజారీయాకు చెందిన ఇబ్రహీం అహ్మద్ తో పాటు గీతా దోషి, రిత్బన్ ఆచార్య నటించారు. ఈ లఘు చిత్రం అగ్రశ్రేణి ప్రపంచ చలన చిత్ర పాఠశాలల నుండి ఉద్భవిస్తున్న ప్రతిభను హైలెట్ చేస్తుందని చెప్పక తప్పదు. సరిహద్దులను దాటిన ఈ కథ కలలు కనే ప్రతి ఒక్కరికి స్పూర్తి దాయకంగా నిలుస్తుంది.పాఠంగా మిగిలి పోనుంది.