18 మందితో ల్యాబ్ ప్యానల్ ఏర్పాటు – ఈవో
ప్రసాద నాణ్యతపై జె. శ్యామల రావు ప్రకటన
తిరుమల – తిరుపతి శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ విషయంపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతున్న ప్రస్తుత తరుణంలో కీలకంగా మారారు టీటీడీ ముఖ్య కార్య నిర్వహణ అధికారి (ఈవో) జె. శ్యామల రావు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ మేరకు కీలక ప్రకటన చేశారు. పుణ్య క్షేత్రంలో చేపట్టిన శాంతి యాగం పూర్తయిందన్నారు.
ఇదే సమయంలో తిరుపతి లడ్డూ ప్రసాదం విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. ఎక్కడా ఇప్పలి వరకు కల్తీ నెయ్యి, నూనె వాడలేదని స్పష్టం చేశారు. అనుమానం వచ్చి పరీక్షలు చేయించడం జరిగిందన్నారు. ఇందుకు సంబంధించి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు పూర్తి నివేదిక అందజేశామన్నారు.
ఇదిలా ఉండగా తిరుపతి లడ్డూ ప్రసాదం నాణ్యత, కల్తీ లేకుండా ఉండేందుకు గాను 18 మందితో ల్యాబ్ ప్యానల్ ను ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు టీటీడీ ఈవో జె. శ్యామల రావు. సెంట్రల్ ఫుడ్ టెక్నలాజికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (సీఎఫ్‌టీఆర్‌ఐ)లో శిక్షణ పొందిన వారు ఈ ప్యానల్‌లో ఉన్నారని స్పష్టం చేశారు.
కేంద్ర ప్రభుత్వం నుంచి ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) ల్యాబ్ ఏర్పాటుకు ముందుకు వచ్చారని, త్వరలోనే దీన్ని ఏర్పాటు చేయనున్నామని వెల్లడించారు ఈవో.