ఆప్..కాంగ్రెస్ సీట్ల ఒప్పందం
ప్రకటించిన ఇరు పార్టీల నేతలు
న్యూఢిల్లీ – కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల నిర్వహణ చేపట్టేందుకు నోటిఫికేషన్ విడుదల చేయనుంది. దీంతో దేశ వ్యాప్తంగా 2024కు సంబంధించి ఆయా పార్టీలు ముందస్తుగా ప్రచారంపై ఫోకస్ పెట్టాయి. ఏపీలో తెలుగుదేశం పార్టీ, జనసేన సంయుక్తంగా శనివారం 99 సీట్లను ప్రకటించాయి.
ఈ ఏడాది ఏప్రిల్ – మే నెలల్లో జరగనున్న రాబోయే లోక్ సభ ఎన్నికల కోసం ఢిల్లీ, హర్యానా, గుజరాత్ , చండీగఢ్ , గోవాలలో ఆప్ , కాంగ్రెస్ పార్టీలు సీట్ల పంపకాలపై ఒప్పందం చేశాయి. ఈ మేరకు కీలక ప్రకటన చేశాయి.
అనంతరం మీడియాతో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ముకుల్ వాస్నిక్ వివరాలు వెల్లడించారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలోని మూడు స్థానాలలో పోటీ చేస్తుందని చెప్పారు. న్యూఢిల్లీ, పశ్చిమ ఢిల్లీ, దక్షిణ ఢిల్లీ , తూర్పు ఢిల్లీ లలో ఆప్ బరిలో ఉంటుందన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ చాందినీ చౌక్, ఉత్తర ఢిల్లీ, తూర్పు , వాయవ్య ఢిల్లీ నుండి కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుందని స్పష్టం చేశారు