ఆప్ ను అంతం చేసే కుట్ర
నిప్పులు చెరిగిన మంత్రి అతిషి
న్యూఢిల్లీ – గత కొంత కాలం నుంచీ ప్రధాన మంత్రి నరేంద్ర మదీ, అమిత్ షా తో కూడిన బీజేపీ సర్కార్ కావాలని కక్ష పూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు ఆప్ మంత్రి అతిషి. ఆదివారం ఆప్ చీఫ్ , సీఎం కేజ్రీవాల్ సారథ్యంలో భారీ ఎత్తున ఆందోళన బాట పట్టారు.
మోదీ నియంతృత్వ ధోరణి ఇంకెంత కాలం భరించాలని ప్రశ్నించారు అతిషి. ఎలాంటి ఆధారాలు లేక పోయినప్పటికీ తమ నాయకుడిని జైల్లో పెట్టారని ఆరోపించారు. కానీ మోదీ పాచికలు పార లేదని, అమిత్ షా కుట్రలు ఫలించ లేదని పేర్కొన్నారు.
ఆరు నూరైనా ఆప్ ను పెకిలించడం, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కూల్చడం అంత సులభం కాదని తెలుసుకుంటే మంచిదన్నారు అతిషి. బీజేపీ ఆడుతున్న కుట్రలో భాగంగానే స్వాతి మలివాల్ కేసు నడుస్తోందని ధ్వజమెత్తారు.
రాజకీయాలు చేయడం మాత్రమే పనిగా పెట్టుకున్న మోదీ పరివారానికి కోలుకోలేని షాక్ తప్పదన్నారు మంత్రి.