Friday, April 4, 2025
HomeNEWSNATIONALఆప్ చీఫ్ కేజ్రీవాల్ ప‌రాజ‌యం

ఆప్ చీఫ్ కేజ్రీవాల్ ప‌రాజ‌యం

సీనియ‌ర్ నేత‌లు సైతం ఓట‌మి

ఢిల్లీ – ఢిల్లీ అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాలు ఆప్ కు షాక్ ఇచ్చాయి. ఆ పార్టీకి చెందిన సీనియ‌ర్ నేత‌లు ప‌రాజ‌యం పొందారు. ఆప్ అధ్య‌క్షుడు, మాజీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ బీజేపీ అభ్య‌ర్థి ప‌ర్వేశ్ వ‌ర్మ చేతిలో ఓట‌మి పాల‌య్యారు.

ఆయ‌న‌తో పాటు మాజీ డిప్యూటీ సీఎం మ‌నీష్ సిసోడియా, మాజీ మంత్రి స‌త్యేంద్ర జైన్ కూడా కేజ్రీవాల్ బాట పట్టారు. మ‌హిళా క‌మిష‌న్ చైర్ ప‌ర్స‌న్ స్వాతి మ‌లివాల్ షాకింగ్ కామెంట్స్ చేశారు కేజ్రీవాల్ పై. త‌న‌పై దాడి చేసినందుకు ప్ర‌జ‌లు త‌గిన రీతిలో బుద్ది చెప్పారంటూ పేర్కొన్నారు.

ప్ర‌స్తుతం స్వాతి మ‌లివాల్ రాజ్య‌స‌భ ఎంపీగా ఉన్నారు. త‌ను సోష‌ల్ మీడియాలో చేసిన పోస్ట్ వైర‌ల్ గా మారింది. 27 ఏళ్ల త‌ర్వాత బీజేపీ అధికారంలోకి రావ‌డం ఆ పార్టీ శ్రేణుల్లో సంతోషం నెల‌కొంది. దేశ రాజ‌ధాని అంత‌టా సంబురాలు మిన్నంటాయి.

ఇదిలా ఉండ‌గా హిందూ ఇతిహాసం మహాభారతం నుండి ద్రౌపది ‘చీరహారన్’ (వస్త్రాలను విప్పడం) ను చిత్రీకరించే పెయింటింగ్ ఉన్న చిత్రాన్ని మలివాల్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. గ‌తంలో కేజ్రీవాల్ కు మ‌ద్ద‌తుగా నిలిచారు. ఇటీవ‌లి కాలంలో త‌న‌ను తీవ్రంగా విమ‌ర్శించే వారిలో ఉన్నారు. కేజ్రీవాల్ నాయ‌క‌త్వం, ఆయ‌న అనుస‌రిస్తున్న విధానాల‌ను పూర్తిగా వ్య‌తిరేకించారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments