NEWSINTERNATIONAL

కేజ్రీవాల్ ను విడుద‌ల చేయండి

Share it with your family & friends

న్యూయార్క్ లో ఆప్ ఆందోళ‌న

న్యూయార్క్ – లిక్క‌ర్ స్కామ్ పేరుతో సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ ను అదుపులోకి తీసుకోవ‌డాన్ని నిర‌సిస్తూ విదేశాల‌లో భారీ ఎత్త‌న ఆందోళ‌న‌లు కొన‌సాగుతున్నాయి. మోదీ స‌ర్కార్ అక్ర‌మంగా అరెస్ట్ చేసింద‌ని వెంట‌నే విడుద‌ల చేయాల‌ని ఆప్ నేత‌లు కోరారు.

ఎలాంటి ఆధారాలు లేకుండా ఎలా అదుపులోకి తీసుకుంటార‌ని ప్ర‌శ్నించారు. కేవ‌లం నిరాధార‌మైన విమ‌ర్శ‌లు చేయ‌డం, ప్ర‌త్య‌ర్థుల‌ను లేకుండా చేయాల‌ని అనుకోవ‌డం మోదీకి అల‌వాటుగా మారింద‌న్నారు. అర‌వింద్ కేజ్రీవాల్ కు మ‌ద్ద‌తుగా వారంతా న్యూయార్క్ న‌గ‌రంలో ఆందోళ‌న చేప‌ట్టారు. ప్ల కార్డుల‌తో ప్ర‌ద‌ర్శ‌న చేప‌ట్టారు.

వెంట‌నే సీఎం అర‌వింద్ కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మ‌నీష్ సిసోడియా, మంత్రి స‌త్యేంద్ర జైన్ ల‌ను విడుద‌ల చేయాల‌ని లేక పోతే తాము ఆందోళ‌న‌ల‌ను ఉధృతం చేస్తామ‌ని హెచ్చ‌రించారు. దేశ రాజ‌ధానిలో ఆప్ ఆధ్వ‌ర్యంలో నిర‌స‌నలు మిన్నంటాయి. ఇప్ప‌టికే ఇండియా కూట‌మి ఆధ్వ‌ర్యంలో సైతం ఆప్ కు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించాయి. ఇది పూర్తిగా ఎన్నిక‌ల వేళ క‌క్ష సాధింపు త‌ప్ప మ‌రోటి కాద‌ని పేర్కొన్నాయి.