కేజ్రీవాల్ అరెస్ట్ అక్రమం
కుట్ర పూరితమన్న ఆప్
న్యూఢిల్లీ – ఆప్ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి కేంద్ర దర్యాప్తు సంస్థ అదుపులోకి తీసుకుంది. దీంతో పెద్ద ఎత్తున రాజధానిలో ఆందోళనలు మిన్నంటాయి. ఆప్ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేపట్టారు. కావాలని ప్రధాన మంత్రి మోదీ, బీజేపీ పరివారం కలిసి కుట్ర పన్నాయంటూ ఆరోపించారు. ఇది పూర్తిగా కక్ష సాధింపు ధోరణి తప్ప మరొకటి కాదని పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా ఇవాళ సెర్చ్ వారెంట్ తో ఎంట్రీ ఇచ్చారు ఈడీ అధికారులు. మొత్తం 12 మంది అధికారులతో కూడిన బృందం ఊహించని రీతిలో షాక్ ఇచ్చింది. భారీ భద్రత మధ్యన వారంతా సీఎం కేజ్రీవాల్ నివాసంలోకి ప్రవేశించారు. ఆపై తన ఇంట్లో సోదాలు చేపట్టారు. చివరకు కేజ్రీవాల్ తో పాటు భార్య కు చెందిన సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
అనంతరం తనను అరెస్ట్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ వెంటనే కేజ్రీవాల్ ను ఈడీ ఆఫీసుకు తీసుకు వెళ్లింది. ఈ సందర్బంగా ఆప్ మంత్రి అతిషి సీరియస్ అయ్యారు. ఆమె మోదీపై నిప్పులు చెరిగారు. ఇదంతా పక్కా ప్లాన్ ప్రకారం చేశారంటూ ఆరోపించారు. ఇంకా ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి .