అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ పై ఆగ్రహం
న్యూఢిల్లీ – ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆప్ చీఫ్ , సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను ఈడీ అరెస్ట్ చేసింది. దీనిని నిరసిస్తూ మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆప్ ఆధ్వర్యంలో మంగళవారం పెద్ద ఎత్తున న్యూఢిల్లీలో ఆందోళన చేపట్టారు. చాలా చోట్ల ఉద్రిక్తత నెలకొంది. కార్యకర్తలు మోదీ సర్కార్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
కావాలని కక్ష సాధింపు ధోరణితోనే తమ పార్టీ చీఫ్ ను అదుపులోకి తీసుకున్నారంటూ ఆరోపించింది. ఇవాళ ఎలక్టోరల్ బాండ్ల పేరుతో అవినీతి పరుల సొమ్మును రూ. 6,000 కోట్లకు పైగా కేంద్రంలోని మోదీ బీజేపీకి ఎలా దక్కాయో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు.
తమ నాయకుడు కేజ్రీవాల్ కు ఎలాంటి సంబంధం లేదన్నారు. లిక్కర్ పాలసీని ఒక్కరు చేయరని, కేబినెట్ మొత్తం కలిసి ఈ నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు. ఆప్ గత కొన్నేళ్లుగా ప్రజా పాలన అందజేస్తోందని , కక్ష కట్టి ఆప్ ను లేకుండా చేయాలనే కేజ్రీవాల్ ను అరెస్ట్ చేశారంటూ ఆరోపించారు ఆప్ నేతలు, కార్యకర్తలు. ఇదిలా ఉండగా శాంతియుతంగా ఆందోళన చేపట్టిన తమపై ఢిల్లీ పోలీసులు ఉక్కు పాదం మోపడంపై మండిపడ్డారు.