ఎన్నికల వేళ కోలుకోలేని దెబ్బ
ఢిల్లీ – ఆమ్ ఆద్మీ పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు కైలాష్ గెహ్లాట్ ఊహించని రీతిలో ఆప్ కు రాజీనామా చేశారు. ఆయన వెంటనే కాషాయ తీర్థం తీసుకున్నారు. సోమవారం భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ప్రత్యక్షం అయ్యారు. కమలం జెండాను కప్పుకున్నారు. ఆయనపై సీబీఐ బస్సు టెండర్ స్కాం కేసు నమోదు చేసింది. దానిని క్లోజ్ చేయాలంటే తప్పనిసరిగా తమ పార్టీలో చేరాలని ఒత్తిడి తీసుకు వచ్చినట్లు సమాచారం.
ఇదిలా ఉండగా కైలాష్ గెహ్లాట్ ఆప్ లో కీలకమైన నాయకుడిగా గుర్తింపు పొందారు. ఆప్ ను బలోపేతం చేయడంలో కృషి చేశారు. త్వరలోనే ఢిల్లీలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ తరుణంలో కైలాష్ గెహ్లాట్ రాజీనామా చేయడం ఆ పార్టీకి తీరని నష్టం కలిగించే ఛాన్స్ ఉంది.
గత కొంత కాలంగా ఢిల్లీపై పట్టు సాధించాలని బీజేపీ శత విధాలుగా ప్రయత్నం చేస్తోంది. కానీ ఆ పార్టీకి
ప్రజలు చుక్కలు చూపిస్తున్నారు. ఆప్ పార్టీ చీఫ్, ఫౌండర్ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం సినోడియా, మాజీ మంత్రి సత్యేందర్ జైన్, ఎంపీ సంజయ్ ఆజాద్ సింగ్ లను అరెస్ట్ చేసింది. జైలుకు పంపింది. అయినా ఆప్ ఎక్కడా తగ్గడం లేదు. మొత్తంగా కైలాష్ భవితవ్యం బీజేపీ తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.