శాంసన్ అద్భుతమైన ఆటగాడు
మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్
దక్షిణాఫ్రికా – కేరళ స్టార్ క్రికెటర్ , రాజస్థాన్ రాయల్స్ జట్టు స్కిప్పర్ సంజూ శాంసన్ పై ప్రశంసలు కురుస్తున్నాయి. గత కొంత కాలంగా అతడిని పక్కన పెడుతూ వచ్చింది భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ). తాజాగా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్, కార్యదర్శి జే షా ఆధ్వర్యంలో వచ్చే జూన్ నెలలో అమెరికా, వెస్టిండీస్ వేదికగా జరిగే టి20 వరల్డ్ కప్ లో పాల్గొనే భారత క్రికెట్ జట్టును ప్రకటించింది.
ఈ జట్టులో అనూహ్యంగా సంజూ శాంసన్ ను ఎంపిక చేసింది బీసీసీఐ. దీంతో సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. తాజా, మాజీ ఆటగాళ్లు సైతం అభినందనలతో ముంచెత్తుతున్నారు. ప్రధానంగా అన్ని రంగాలకు చెందిన ప్రముఖులు సైతం సంజూ శాంసన్ అద్భుతంగా రాణించాలని కోరుతున్నారు.
ఇదిలా ఉండగా ఇదే కోవలోకి వచ్చారు దక్షిణాఫ్రికాకు చెందిన స్టార్ ప్లేయర్ ఏబీ డివిలియర్స్. ఒకప్పుడు చిన్నతనంలో ఉన్న సంజూ శాంసన్ కు ఏబీడీ ఆరాధ్య దైవం. విచిత్రం ఏమిటంటే ఇదే డివిలయర్స్ కు ప్రీతిపాత్రుడైన యంగ్ క్రికెటర్ ఎవరంటే సంజూ అని పేర్కొన్నారు. తాను ఇటీవలి కాలంలో చూసిన యంగ్ క్రికెటర్లలో శాంసన్ ఒకడు అని కొనియాడారు.