ప్రయారిటీ పోస్టు ఇచ్చిన సీఎం చంద్రబాబు
అమరావతి – గత జగన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న మాజీ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వర్ రావుకు ఏపీ కూటమి సర్కార్ అత్యధిక ప్రాధాన్యత కలిగిన పోస్టులో నియమించింది. ఏబీవీని ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషణ్ లిమిటెడ్ చైర్మన్ గా నియమించింది. సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు సీఎస్ కె. విజయ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
గతంలో పలు కేసులు మోపింది. వాటన్నింటిని తట్టుకుని నిలబడ్డారు. తను చంద్రబాబుకు మేలు చేకూర్చేలా చేశాడని ఆరోపణలు ఎదుర్కొన్నారు. కూటమి సర్కార్ కొలువు తీరడంతో తనకు కీలక పోస్టు దక్కింది.
ఇదిలా ఉండగా ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ గా ఏవీ వెంకటేశ్వర్ రావు రెండేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వైకాపా ప్రభుత్వ హయాంలో సస్పెన్షన్ గురైన ఏ.బి వెంకటేశ్వరరావును కూటమి ప్రభుత్వం ఇటీవల సస్పెన్షన్ ఎత్తివేస్తూ ఉత్తర్వులు జారీచేసిన విషయం విదితమే.
తనపై నమ్మకం ఉంచి గౌరవ ప్రదమైన పోస్టును అప్పగించినందుకు సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ధన్యవాదాలు తెలిపారు. పోలీస్ శాఖలో ఉన్నత పదవులు నిర్వహించిన అనుభవం కార్పొరేషన్ చైర్మన్ గా పని చేసేందుకు దోహద పడుతుందన్నారు.