వినేష్ ఫోగట్ రియల్ ఛాంపియన్
ప్రశంసించిన ఏఎఫ్ఎల్ ఫౌండర్
న్యూఢిల్లీ – ఏఎఫ్ఎల్ వైస్ చైర్మన్ , ఫౌండర్ ..ఒలింపిక్స్ అథ్లెట్స్ కమిషన్ మెంబర్ ..ప్రముఖ అథ్లెట్ అభినవ్ బింద్రా ప్రశంసల జల్లులు కురిపించాడు భారత రెజ్లర్ వినేష్ ఫోగట్ పై. కేవలం 100 గ్రాముల బరువు ఎక్కువగా ఉందన్న కారణంగా తనను పారిస్ ఒలింపిక్స్ ఫైనల్స్ పోటీ నుంచి తప్పించారు. దీనిపై పెద్ద ఎత్తున రాద్దాంతం చోటు చేసుకుంది.
గురువారం ట్విట్టర్ వేదికగా అభినవ్ బింద్రా స్పందించారు. ఆటలో గెలుపు ఓటములు అత్యంత సహజమని ప్రతి ఒక్కరికీ తెలుసు. కానీ వినేష్ ఫోగట్ ..నువ్వు సాగించిన పోరాటం ఎప్పటికీ ఈ దేశ ప్రజలకు గుర్తుండి పోతుందని స్పష్టం చేశారు.
దేశ వ్యాప్తంగా నీ వైపు నిలబడడం నన్ను మరింత ఆశ్చర్యానికి లోను చేసిందని తెలిపారు అభినవ్ బింద్రా. ఛాంపియన్లు ఎందరో ఉంటారు..కానీ అసలైన ఛాంపియన్ మాత్రం నువ్వేనంటూ వినేష్ ఫోగట్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. పారిస్ లో ఉన్న వినేష్ ఫోగట్ కు అభినవ్ బింద్రా పుష్ప గుచ్ఛం ఇచ్చి అభినందించడం విశేషం.