అభిషేక్ శర్మ సేమ్ సీన్
ఆట తీరుపై ఫ్యాన్స్ ఫైర్
దక్షిణాఫ్రికా – సఫారీ టూర్ లో భాగంగా జరిగిన రెండో టి20 మ్యాచ్ లో ఓటమి పాలైంది భారత జట్టు. దక్షిణాఫ్రికా కెప్టెన్ టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. తను తీసుకున్న నిర్ణయం సరైనదేనని తేలి పోయింది. సఫారీ బౌలర్ల ధాటికి విల విల లాడారు.
తొలి టి20 మ్యాచ్ లో సెంచరీతో కదం తొక్కిన సంజూ శాంసన్ తీవ్ర నిరాశ పరిచాడు. డకౌట్ తో వెనుదిరిగాడు. ఇక ఎప్పటి లాగానే ఓపెనర్ అభిషేక్ శర్మ పెవిలియన్ బాట పట్టాడు. కేవలం 4 పరుగులు మాత్రమే చేశాడు. తొలి టి20లో 7 రన్స్ తో నిరాశ పరిచాడు. గత 10 ఇన్నింగ్స్ లలో కనీసం పరుగులు చేయక పోవడం విస్తు పోయేలా చేసింది.
ఇక హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ మాత్రమే ఆడడంతో కాస్తా పరువు దక్కింది భారత జట్టుకు. దీంతో రెండో టి20 దక్షిణాఫ్రికా పరమైంది.
వరుణ్ చక్రవర్తి కేవలం 17 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు తీసినా చివరకు దక్షిణాఫ్రికా గెలుపొందింది. దీంతో సఫారీలు 3 వికెట్ల తేడాతో విజయం సాధించారు. ఇక మ్యాచ్ పరంగా చూస్తే తొలుత బ్యాటింగ్ కు దిగిన భారత్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 124 రన్స్ చేసింది.
జట్టులో పాండ్యా 39 రన్స్ చేసి నాటౌట్ గా నిలిస్తే పటేల్ 27, వర్మ 20 పరుగులు చేశారు. వీరే ఎక్కువ పరుగులు చేసిన ఆటగాళ్లు. టాపార్డర్ కుప్ప కూలింది సఫారీల దెబ్బకు. పీటర్, సిమెలానే, జాన్సెన్ , కొయెట్టి అద్బుతంగా బౌలింగ్ చేశారు.
అనంతరం బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా స్టబ్స్ 47 , కొయెట్టి 19 చేసి తమ జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించారు.