దంచి కొట్టిన ట్రావిస్ హెడ్ ..పంజాబ్ బోల్తా
హైదరాబాద్ – వరుస పరాజయాలతో తీవ్ర నిరాశకు గురి చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఎట్టకేలకు జూలు విదిల్చింది. ఉప్పల్ లో జోరు మీదున్న పంజాబ్ కింగ్స్ ఎలెవన్ కు చుక్కలు చూపించింది. అభిషేక్ శర్మ ఉతికి ఆరేశాడు. ఫోర్లు, సిక్సర్లతో విరుచుకు పడ్డాడు. తనతో పాటు ట్రావిస్ హెడ్ కూడా జోరు పెంచాడు. షాన్ దార్ సెంచరీతో ఎస్ ఆర్ హెచ్ సూపర్ విక్టరీ సాధించింది. 245 పరుగుల భారీ టార్గెట్ ను అవలీలగా సాధించింది. విస్తు పోయేలా చేసింది. ట్రావిస్ హెడ్ 66 రన్స్ చేశాడు. ఇద్దరూ కలిసి 171 రన్స్ జోడించారు. క్లాసెన్ 21 రన్స్ తో నాటౌట్ గా నిలిచాడు. 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 2వ విజయాన్ని నమోదు చేసింది.
19 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన శర్మ మరో 21 బాల్స్ లో సెంచరీ చేశాడు. 11 ఫోర్లు 6 సిక్సర్లతో తొలి శతకం సాధించాడు. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ హైదరాబద్ బౌలర్లను ఉతికి ఆరేశారు. ఓపెనర్లు ప్రభ్ సిమ్రాన్ సింగ్ 42 రన్స్ చేస్తే ప్రియాన్ష్ ఆర్య 36 పరుగులు చేశాడు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అద్భుతంగా ఆడాడు. 82 రన్స్ తో కీ రోల్ పోషించాడు. ఆఖరి 20వ ఓవర్ లో మార్కస్ స్టోయినిస్ దుమ్ము రేపాడు. ఏకంగా నాలుగు సిక్సర్లు కొట్టాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 245 రన్స్ చేసింది. సన్ రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి టార్గెట్ రీచ్ అయ్యింది.