24 పరుగులు ఇచ్చి 2 వికెట్లు
చెన్నై – ఐపీఎల్ 2024లో ఆసిస్ క్రికెటర్ ప్యాట్ కమిన్స్ సారథ్యంలోని సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆది నుంచే ఈ 17వ సీజన్ లో దుమ్ము రేపింది. రాజస్థాన్ రాయల్స్ జట్టు ఆశలపై నీళ్లు చల్లింది. ముందుగా హైదరాబాద్ జట్టును 176 పరుగులకే కట్టడి చేసినా చివరకు ఛేదనలో చేతులెత్తేసింది. ప్రధానంగా సన్ రైజర్స్ అద్భుతమైన ఆట తీరుతో ఆకట్టుకుంది. బౌలర్ల ప్రతాపానికి విల విల లాడింది సంజూ శాంసన్ సేన.
పరుగులు చేయలేక నానా తంటాలు పడ్డారు. ధ్రువ్ జురైల్ ఒక్కడు మాత్రమే దుమ్ము రేపాడు. హైదరాబాద్ బౌలర్లను తట్టుకుని నిలబడ్డాడు. ఇక హైదరాబాద్ జట్టుకు చెందిన స్పిన్నర్లు షాబాజ్ అహ్మద్ , అభిషేక్ తిప్పేశారు. అద్భుతమైన బౌలింగ్ తో రాజస్థాన్ ను శాసించారు.
వీరి స్పిన్ మాయ జాలానికి సంజూ శాంసన్, రియాన్ పరాగ్, సిమ్రాన్ హిట్ మెయిర్ , రోమన్ పావెల్ , రవిచంద్రన్ అశ్విన్. బౌల్ట్ లు పెవిలియన్ దారి పట్టారు. ఓపెనర్ యశస్వి జైశ్వాల్ తో పాటు ధ్రువ్ జురైల్ మాత్రమే సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టును ఎదుర్కొనే ప్రయత్నం చేశారు.
ఇక అభిషేక్ శర్మ 24 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు తీశాడు. 3 వికెట్లు తీసిన 24 రన్స్ ఇచ్చిన షాబాజ్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.