DEVOTIONAL

శ్రీ‌వారి అన్న‌దానం ట్ర‌స్టుకు భారీ విరాళం

Share it with your family & friends

రూ. 10 ల‌క్ష‌లు అంద‌జేసిన బ్యాటే గౌడ

తిరుమ‌ల – తిరుమ‌ల‌కు నిత్యం వ‌చ్చే వేలాది మంది భ‌క్తుల‌కు ఆక‌లిని తీరుస్తోంది శ్రీ వెంగ‌మాంబ స‌త్రం. దీంతో పాటు మిగ‌తా చోట్ల కూడా టీటీడీ భారీ ఎత్తున అన్న ప్ర‌సాదాన్ని అంద‌జేస్తోంది. ఇందులో శ్రీ‌వారి భ‌క్తులు సేవ‌లు అందిస్తున్నారు. చాలా చోట్ల ఇత‌ర ప్రాంతాల నుంచి అష్ట క‌ష్టాలు ప‌డి వ‌చ్చే భ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చ‌ర్యలు చేప‌ట్టింది.

ప్ర‌తి రోజూ రూ. 38 ల‌క్ష‌ల రూపాయ‌ల‌కు పైగా ఖ‌ర్చవుతోంది కేవ‌లం అన్న‌దానానికి . భారీ ఎత్తున దాత‌లు త‌మ‌కు తోచినంత మేర సాయం చేస్తున్నారు. విరాళాలు అంద‌జేస్తున్నారు. శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి అన్న‌దానం ట్ర‌స్టును ఏర్పాటు చేసింది టీటీడీ.

తాజాగా ఎస్వీ అన్న‌దానం ట్ర‌స్టుకు రూ. 10 ల‌క్ష‌లు విరాళంగా ఇచ్చారు బెంగ‌ళూరుకు చెందిన ఏబియం ఇన్ఫ్రాటెక్ అధినేత ఎస్.ఎన్.బ్యాటే గౌడ .తిరుమలలోని గోకులం విశ్రాంతి భవనంలో టీటీడీ ఈవో జె.శ్యామల రావుకు ఈ మేరకు చెక్కును అందజేశారు.

ఈ కార్యక్రమంలో చంద్రగిరి ఎంఎల్ఏ పులివర్తి నాని, ఇతర అధికారులు పాల్గొన్నారు.