ఏసీబీ వలలో పెద్ద చేప
సీసీఎస్ ఏసీపీపై కేసు
హైదరాబాద్ – తెలంగాణలో ఈ మధ్య అక్రమార్కుల జాబితా రోజు రోజుకు పెరుగుతోంది. గత సర్కార్ లో అడ్డగోలుగా సంపాదించిన వారంతా మెల మెల్లగా బయటకు వస్తున్నారు. తాజాగా అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ వలలో పెద్ద చేప చిక్కింది.
అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ ) హైదరాబాద్ లోని పలు ప్రాంతాలలో తనిఖీలు చేపట్టింది. సెంట్రల్ క్రైమ్ స్టేషన్ లో ఏసీపీగా ఉన్న ఉమా మహేశ్వరరావు పై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ఆదాయ వనరులకు మించి ఆస్తులు కలిగి ఉన్నారని విమర్శలు ఉన్నాయి.
అశోక్‌నగర్‌లోని రావు నివాసంలో ఏసీబీ సోదాలు చేసింది. సాహితీ ఇన్ఫ్రా కేసుల్లో దర్యాప్తు అధికారిగా ఉన్నారు. గతంలో బంజారాహిల్స్‌కు చెందిన వ్యాపారి శరణ్ చౌదరి మాజీ టాస్క్ ఫోర్స్ ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్డి) రాధా కిషన్ రావు, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఏసీపీ ఉమా మహేశ్వరరావులపై ఫిర్యాదు చేశారు. ఆగస్టు 2023లో తనను నిందితులు అక్రమంగా నిర్బంధించి, దాడి చేసి, దోపిడీ చేశారని చౌదరి ఆరోపించారు.
మాజీ మంత్రి బంధువైన విజయ్‌కు ఫ్లాట్ యాజమాన్యాన్ని బదలాయించేలా ఎసిపి ఉమామహేశ్వరరావు ఎలా తన్నాడు, చెప్పుతో కొట్టి, బలవంతం చేశాడని చౌదరి ఫిర్యాదులో వివరించారు.