NEWSTELANGANA

గొర్రెల స్కాంలో న‌లుగురు అరెస్ట్

Share it with your family & friends

రూ. 2 కోట్ల‌కు పైగా దుర్వినియోగం

హైద‌రాబాద్ – తెలంగాణ రాష్ట్రంలో అవినీతి, అక్ర‌మాల‌కు పాల్ప‌డుతున్న వారి భ‌ర‌తం ప‌ట్టే ప‌నిలో బిజీగా మారింది అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ). ఇప్ప‌టికే హైద‌రాబాద్ న‌గ‌ర పాల‌క సంస్థ‌లో డిప్యూటీ డైరెక్ట‌ర్ గా ఉన్న శివ బాలాజీని అదుపులోకి తీసుకుంది. లెక్క‌కు మించి ఆస్తులు, న‌గ‌దు, ఆభ‌ర‌ణాల‌ను స్వాధీనం చేసుకుంది ఏసీబీ. రూ. 250 కోట్ల‌కు పైగా ఆస్తులు ఉన్న‌ట్లు గుర్తించింది. ఇదే స‌మ‌యంలో కీస‌ర త‌హ‌శిల్దార్ ను అదుపులోకి తీసుకుంది.

గిరిజ‌న సంక్షేమ శాఖ‌లో ఏఈని ప‌ట్టుకుంది రెడ్ హ్యాండెడ్ గా. రూ. 10 ల‌క్ష‌ల న‌గదుతో పాటు 4 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకుంది ఏసీబీ. త‌వ్విన కొద్దీ అవినీతి చేప‌లు చిక్కుతున్నాయి. తాజాగా తెలంగాణ పశు సంవర్ధక శాఖ అధికారులపై నమోదైన క్రిమినల్ దుర్వినియోగం (ఆర్‌సిఓ) కేసులో నలుగురు ప్రభుత్వ అధికారులను అవినీతి నిరోధక శాఖ అరెస్టు చేసింది.

డా. డి. రవి, డా. ఎం. ఆదిత్య కేశవ సాయి, పసుల రఘుపతి రెడ్డి, సంగు గణేష్‌లు ప్రైవేట్ వ్యక్తులతో కుమ్మక్కయి నకిలీ బినామీ ఖాతాలు సృష్టించారు. అంతే కాకుండా ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేశారు. దాదాపు రూ. 2 కోట్ల‌కు పైగా నొక్కేశారంటూ ఆరోపించింది ఏసీబీ.