కేటీఆర్..అరవింద్ కుమార్ పై కేసు
ఏ-1గా మాజీ మంత్రి పేరు నమోదు
హైదరాబాద్ – మాజీ మంత్రి కేటీఆర్ ను అరెస్ట్ చేసేందుకు రంగం సిద్దమైంది. ఇప్పటికే రాష్ట్ర సర్కార్ చాలా దూకుడుగా వ్యవహరిస్తోంది. ఎలాగైనా జైలుకు పంపించాలని సీఎం ఉవ్విళ్లూరుతున్నట్లు కనిపిస్తోంది. తనను అరెస్ట్ చేసేందుకు ముందస్తు అనుమతి తీసుకోవాల్సి రావడంతో తెలివిగా గవర్నర్ కు లేఖ రాసింది సర్కార్.
గవర్నర్ వర్మ న్యాయ నిపుణుల సలహా తీసుకుని కేసు నమోదుకు ఓకే చెప్పారు. అంతకు ముందు తమకు కేసు నమోదు చేసేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా ఏసీబీ లేఖ రాసింది గవర్నర్ కు. ఈ మేరకు ఛాన్స్ దక్కడంతో దూకుడు పెంచింది దర్యాప్తు సంస్థ.
గురువారం ఏసీబీ కీలక ప్రకటన చేసింది. అధికారికంగా ఫార్ములా ఈ కారు రేసుకు సంబంధించి మాజీ మంత్రి కేటీఆర్ తో పాటు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్ పై కేసు నమోదు చేసినట్లు వెల్లడించింది.
అంతే కాకుండా ఈ ఇద్దరితో పాటు ప్రైవేట్ కంపెనీకి చెందిన సీఈవో బీఎల్ఎన్ రెడ్డిపై కూడా కేసు నమోదు చేశామని తెలిపింది. ఏ-1గా కేటీఆర్ పేరుని నమోదు చేసినట్లు పేర్కొంది ఏసీబీ.