NEWSTELANGANA

ఏసీబీకి చిక్కిన వ‌ర్ణి ఎస్ఐ

Share it with your family & friends

రూ. 20 వేలు లంచం తీసుకుంటూ

నిజామాబాద్ జిల్లా – అవినీతి నిరోధ‌క శాఖ‌కు అడ్డంగా చిక్కాడు పోలీసుల‌ను రక్షించాల్సిన ఎస్ఐ. ఈ ఘ‌ట‌న శుక్ర‌వారం చోటు చేసుకుంది. తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ జిల్లా వ‌ర్ణి ర‌క్ష‌క భ‌ట నిల‌యం లోని స్టేష‌న్ హౌస్ అధికారి (ఎస్ఐ) బి. కృష్ణ కుమార్ వేధింపుల‌కు పాల్ప‌డ్డాడు.

సెక్ష‌న్ 35 బీఎన్ఎస్ఎస్ ప్ర‌కారం నోటీసు ఇవ్వ‌డానికి, ఫిర్యాదుదారునిపై త‌దుప‌రి వేధింపు చ‌ర్య‌లు చేప‌ట్ట‌కుండా ఉండేందుకు గాను రూ. 20,000 లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్ర‌యించారు.

విష‌యం తెలుసుకున్న వెంట‌నే ఏసీబీ రంగంలోకి దిగింది. ఎస్ఐ కృష్ణ కుమార్ రూ. 20 వేలు తీసుకుంటుండ‌గా రెడ్ హ్యాండెడ్ గా ప‌ట్టుకున్నారు. దీంతో ఊహించ‌ని రీతిలో ఏసీబీ రంగంలోకి దిగ‌డంతో ఎస్ఐ విస్తు పోయాడు. ఇందుకు సంబంధించి ఫోటోను, డ‌బ్బుల‌తో కూడిన చిత్రాల‌ను విడుద‌ల చేసింది ఏసీబీ.

ఇదిలా ఉండ‌గా నిన్న‌నే మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లా ఇంచార్జి డీఈవో ర‌వీంద‌ర్ ను రూ. 50,000 వేలు తీసుకుంటడ‌గా ఏసీబీ వ‌ల‌ప‌న్ని ప‌ట్టుకుంది. ఏసీబీ దూకుడుతో ఇత‌ర అధికారుల‌లో ఆందోళ‌న మొద‌లైంది .

కాగా రాష్ట్రానికి చెందిన వారు ఎవ‌రైనా లంచం అడిగినా లేదా డిమాండ్ చేసినా వెంట‌నే ఏసీబీకి చెందిన
1064 కు డయల్ చేయాల‌ని కోరింది .