ఫార్ములా ఈ కార్ రేస్ పై ఏసీబీ దూకుడు
ప్రత్యేక బృందానికి డైరెక్టర్ గా తరుణ్ జోషి
హైదరాబాద్ – మాజీ మంత్రి కేటీఆర్ ను అరెస్ట్ చేసేందుకు దూకుడు పెంచింది ఏసీబీ. ఫార్ములా ఈ-కార్ రేస్ విచారణ కోసం ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేశారు. ఏసీబీలో సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ ( CIU) ఏర్పాటు చేశారు. ఈ ప్రత్యేక బృందానికి డైరెక్టర్ గా తరుణ్ జోషి బాధ్యతలు తీసుకున్నట్లు సమాచారం.
ఏసీబీ డీజీ విజయ్ కుమార్ ఈ కేసును మానిటరింగ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. HMDA తో పాటు పలు శాఖల నుంచి కీలక ఫైల్స్ తెప్పించుకుంది ఏసీబీ. ఇదిలా ఉండగా మాజీ మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. ఈ మొత్తం వ్యవహారంలో కావాలని సీఎం తనను టార్గెట్ చేశారంటూ ఆరోపించారు.
తాను ఎలాంటి విచారణకైనా ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నామని ప్రకటించారు. ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని స్పష్టం చేశారు. అన్ని ఆధారాలు తమ వద్ద ఉన్నాయని స్పష్టం చేశారు. ఒక్క పైసా పక్కకు వెళ్లలేదని, అలాంటప్పుడు ఏసీబీ ఎలా కేసు నమోదు చేస్తుందని ప్రశ్నించారు కేటీఆర్. దానికి ఎలాంటి హక్కు లేదన్నారు.